దీన్ని బట్టి వైసీపీ వారు ఎంతగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు: నారా లోకేశ్
- సామాన్యులు ఆత్మహత్యే శరణ్యం అనుకునే దారుణమైన పరిస్థితి
- కాకినాడ కలెక్టరేట్ ముందు తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నం
- దాడికి పాల్పడిన వైకాపా నేతను కఠినంగా శిక్షించాలన్న లోకేశ్
తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిన్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లి, కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారని ఓ దినపత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
'వైఎస్ జగన్ పాలనలో సామాన్యులకు ఆత్మహత్యే శరణ్యం అనే దారుణమైన పరిస్థితి దాపురించింది. కాకినాడ కలెక్టరేట్ ముందు ఒక తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నం చేశారంటే వైకాపా రాక్షసులు ఎంతగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు' అని లోకేశ్ విమర్శించారు.
'కాకినాడకు చెందిన కుంచె నాని అనే మహిళ ఇల్లు కబ్జా చెయ్యడమే కాకుండా కుటుంబంపై దాడి చేశాడు స్థానిక వైకాపా నేత బి.రాజు. ఫిర్యాదు చేస్తే మహిళకు న్యాయం చెయ్యాల్సింది పోయి దాడి చేసిన వ్యక్తికే పోలీసులు వత్తాసు పలకడం అన్యాయం' అని లోకేశ్ పేర్కొన్నారు.
'తక్షణమే అధికారులు స్పందించి బాధిత మహిళకు న్యాయం చెయ్యాలి. దాడికి పాల్పడిన వైకాపా నేత, అనుచరులను కఠినంగా శిక్షించాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.