ఆదిసాయికుమార్ కొత్త చిత్రం టైటిల్ ఖరారు!

  • వీరభద్రం నుంచి క్రైమ్ థ్రిల్లర్
  • 'కిరాతక' టైటిల్ ఫిక్స్
  • కథానాయికగా పాయల్
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్      
ఆదిసాయికుమార్ కథానాయకుడిగా వీరభద్రం ఒక సినిమాను రూపొందించనున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక కథను బట్టి కొన్ని టైటిల్స్ ను పరిశీలించారు. చివరికి 'కిరాతక' అనే టైటిల్ ను ఎంపిక చేశారు. అధికారికంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు .. టైటిల్ ను బట్టే తెలిసిపోతోంది. పవర్ఫుల్ విలనిజం ఉంటుందనే విషయం కూడా అర్థమవుతూనే ఉంది.

ఆదిసాయికుమార్ కి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. అలాంటి హిట్ కోసమే ఆయన ఎదురుచూస్తున్నాడు. ఇటీవల వచ్చిన 'శశి' పై ఆయన ఆశలు పెట్టుకున్నాడుగానీ, ఆ సినిమా థియేయటర్ల దగ్గర నిలబడలేక పోయింది. దాంతో ఆయన తాజా చిత్రంపైనే గట్టినమ్మకంతో ఉన్నాడు. దర్శకుడు వీరభద్రం కూడా సరైన హిట్ కోసమే ఎదురుచూస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక కొంతకాలంగా మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్న పాయల్, ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని భావిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురికీ ఈ సినిమా హిట్ చాలా అవసరమే!


More Telugu News