చైనాకు షాక్.. ఫ్యాక్టరీని ఇండియాకు తరలించిన శాంసంగ్

  • చైనాలో డిస్ ప్లే ప్లాంటును నిర్మించాలనుకున్న శాంసంగ్
  • తాజాగా యూపీలోని నోయిడాకు ప్లాంట్ ను తరలించాలని నిర్ణయం
  • సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన శాంసంగ్ బృందం
చైనాకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే చైనాలో డిస్ ప్లే తయారీ ప్లాంట్ ను నిర్మించాలని ప్రముఖ సంస్థ శాంసంగ్ తొలుత నిర్ణయించింది. అయితే, ఆ ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో శాంసంగ్ సీఈవో కెన్ కాంగ్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది.

ఈ సందర్భంగా శాంసంగ్ బృందం మీడియాతో మాట్లాడుతూ,... మెరుగైన పారిశ్రామిక విధానం, పెట్టుబడిదారులతో స్నేహపూర్వక విధానాల కారణంగా నోయిడాలో తమ ప్లాంటును పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. మరోవైపు శాంసంగ్ కు సీఎం యోగి పూర్తి భరోసాను కల్పించారు. భవిష్యత్తులో కూడా శాంసంగ్ కు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.


More Telugu News