బీజేపీలో కూడా మాకు మిత్రులు ఉన్నారు: శివసేన ఎంపీ అరవింద్ సావంత్

  • మేము ఎవరినీ శత్రువులుగా చూడం
  • విపక్షాలను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోంది
  • నారద స్కామ్ లో ఉన్న ఇద్దరు బెంగాల్ నేతలు బీజేపీలో చేరిపోయారు
బీజేపీతో తమకు రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ, ఇరు పార్టీల సిద్ధాంతాలు వేరైనప్పటికీ, వారితో తమకున్న సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చెప్పారు. తాము ఎవరినీ శత్రువులుగా చూడమని అన్నారు. ప్రతిపక్ష నేతలను తాము శత్రువులుగా చూడబోమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర వ్యవస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్థలను కక్ష సాధింపులకు ఉపయోగిస్తున్నాయని అన్నారు.

బీజేపీతో చేతులు కలపడానికి ఆ పార్టీ ఇలాంటి పనులు చేస్తోందని... ఇది ముమ్మాటికీ బ్లాక్ మెయిల్ చేయడమేనని దుయ్యబట్టారు. బెంగాల్ లో కూడా బీజేపీ ఇలాంటి కుట్రలకే పాల్పడుతోందని అన్నారు. నారద స్కామ్ లో ఉన్న ఇద్దరు నేతలు బీజేపీలో చేరిపోయారని... వారిద్దరినీ కేంద్రం ఏమీ అనడం లేదని విమర్శించారు.


More Telugu News