పైనుంచి కొట్టుకొస్తున్న శవాలతో గంగానది కలుషితమవుతోంది: మమతా బెనర్జీ

  • ఇటీవల యూపీ, బీహార్ వద్ద గంగానదిలో శవాలు
  • నదిలో కరోనా మృతుల శవాలతో కలుషిత వాతావరణం
  • శవాలను బయటికి తీస్తున్నామన్న మమత
  • తామే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి
ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గంగానదిలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకు రావడం తీవ్ర కలకలం రేపింది. పెద్ద సంఖ్యలో శవాలు నదిలో కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇప్పటికీ నదిలో శవాలు కొట్టుకుస్తూనే ఉన్నాయని తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.  

కరోనాతో చనిపోయినట్టుగా భావిస్తున్న మృతదేహాలు ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్ వైపు కొట్టుకొస్తున్నాయని వెల్లడించారు. ఇలాంటి శవాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నదీ జలాలు కలుషితం అవుతున్నాయని మమత ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి తామే నదిలోంచి శవాలను బయటికి తీసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామని వివరించారు.


More Telugu News