తమిళనాడు ఆర్థిక సలహా సంఘంలో రఘురాం రాజన్, ఎస్తర్ డఫ్లో
- మొత్తం ఐదుగురు సభ్యులతో సంఘం ఏర్పాటు
- ఆర్థికపరమైన అంశాల్లో సీఎంకు సలహాలు ఇవ్వనున్న కమిటీ
- మరో ముగ్గురూ ఆర్థిక రంగంలో అపార అనుభవం ఉన్నవారే
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని వెల్లడి
- భర్త అభిజిత్ బెనర్జీతో కలిసి నోబెల్ పొందిన ఎస్తర్ డఫ్లో
తమిళనాడు ప్రభుత్వం సోమవారం సీఎంకు ఆర్థికపరమైన విషయాల్లో సహకారం అందించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ సలహా సంఘాన్ని ప్రకటించింది. దీంట్లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సహా, భర్త అభిజిత్ బెనర్జీతో కలిసి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఎస్తర్ డఫ్లోకు స్థానం దక్కింది. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక, సామాజిక పరమైన అంశాలపై ఈ సంఘం సీఎం స్టాలిన్‌కు సలహాలు అందించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, సంక్షేమ ఆర్థశాస్త్రవేత్త జీన్ డ్రెజ్, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రధాని మోదీకి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన ఎస్.నారాయణ్‌కి ఈ సలహా సంఘంలో చోటు దక్కింది. అధిక అప్పులు, ఆర్థిక లోటు వంటి సమస్యలతో రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల ఆశలు భారీ ఎత్తున ఉన్నాయని పేర్కొంది.