యాదాద్రికి చేరుకున్న కేసీఆర్
- వరంగల్ నుంచి యాదాద్రికి చేరుకున్న కేసీఆర్
- యాదాద్రి పనులను పరిశీలించనున్న సీఎం
- చివరి దశకు చేరుకున్న యాదాద్రి ఆలయం పనులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి నరసింహస్వామి ఆలయ పనులను ఆయన పరిశీలించనున్నారు. భారీ బడ్జెట్ తో యాదాద్రి అభివృద్ధి పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆలయాన్ని అత్యంత సుందరంగా పునర్నిర్మిస్తున్నారు. ఈ ఆలయ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. పనులను పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. ఈరోజు వరంగల్ లో కేసీఆర్ పర్యటించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు హన్మకొండగా నామకరణం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన యాదాద్రికి బయల్దేరారు.