ఏపీలో కొత్తగా 2,620 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 55,002 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 531 కొత్త కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 88 కేసులు
- రాష్ట్రంలో 44 కరోనా మరణాలు
- కరోనా నుంచి కోలుకున్న 7,504 మంది
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 55,002 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 531 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 88 కేసులు గుర్తించారు. గత రెండు నెలల కాలంలో ఓ జిల్లాలో రెండంకెల్లో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
అదే సమయంలో రాష్ట్రంలో 7,504 మంది కరోనా నుంచి కోలుకోగా, 44 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 10 మంది కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 18,53,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,82,680 మంది కోలుకున్నారు. ఇంకా 58,140 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,363కి చేరింది.