మా క్షేమం గురించి ఆరా తీసిన గవర్నర్ మేడమ్ కు కృతజ్ఞతలు: మంత్రి హరీశ్ రావు

  • గతరాత్రి హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం
  • సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
  • కాన్వాయ్ కు అడ్డొచ్చిన అడవిపంది
  • కాన్వాయ్ లో పరస్పరం ఢీకొన్న వాహనాలు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు గతరాత్రి సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం నుంచి తప్పించుకోవడం తెలిసిందే. ఓ అడవిపంది ఆయన కాన్వాయ్ కి అడ్డురావడంతో, కాన్వాయ్ లోని పలు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పంది చనిపోగా, కాన్వాయ్ లో వాహనాలు ధ్వంసం కావడం తప్ప ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధిపేట సమీపంలో హరీశ్ రావు కాన్వాయ్ కి జరిగిన ఘటనపై ఫోన్ లో వివరాలు తెలుసుకున్నట్టు ఆమె వెల్లడించారు.

దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ, తమ గురించి ఆరా తీసిన గవర్నర్ మేడమ్ కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. తమ క్షేమం పట్ల ఆమె ఎంతో ఆందోళన కనబర్చారని, అయితే, ఈ ఘటనలో తనకు గానీ, తన కాన్వాయ్ లో ఎవరికీ గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని హరీశ్ రావు వెల్లడించారు. అందరం క్షేమంగా ఉన్నామని తెలిపారు.


More Telugu News