డబ్ల్యూటీసీ ఫైనల్: నాలుగో రోజు ఆట ప్రారంభానికి వరుణుడి ఆటంకం

  • సౌతాంప్టన్ లో వర్షాలు
  • మ్యాచ్ కు పలుమార్లు అంతరాయాలు
  • నేడు కూడా వరుణుడి జోరు
  • ఇప్పటికీ ప్రారంభం కాని ఆట
భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు వరుణుడి బెడద వీడేట్టు లేదు. ఇవాళ నాలుగో రోజు కూడా వరుణుడు ప్రత్యక్షం కావడంతో మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. మ్యాచ్ కు వేదికైన సౌతాంప్టన్ లో ఇప్పటికీ వర్షం పడుతుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. భారీ వర్షం కాకపోయినా, అదే పనిగా కురుస్తుండడంతో మైదానాన్ని మ్యాచ్ కు అనువుగా మార్చేందుకు వీలుకావడంలేదు.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్... భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. బౌలింగ్ కు బాగా అనుకూలిస్తున్న పరిస్థితుల్లో భారత్  తొలి ఇన్నింగ్స్ లో అతికష్టమ్మీద 217 పరుగులు చేయగలిగింది. ఆపై బరిలో దిగిన కివీస్ మూడో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉన్నారు. క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ ఉన్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్, ఇషాంత్ చెరో వికెట్ తీశారు.


More Telugu News