బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జీహెచ్ఎంసీ మేయర్ పుట్టినరోజు వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య

  • నేడు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి జన్మదినం
  • బసవతారకం ఆసుపత్రి సందర్శన
  • క్యాన్సర్ రోగుల మధ్య వేడుకలు
  • కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ  
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో, తన జన్మదినం సందర్భంగా ఆమె నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను పరామర్శించి, వారిలో ఆనందం నింపే ప్రయత్నం చేశారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీ జీవితంలోని ముఖ్యమైన రోజును బసవతారకం ఆసుపత్రిలోని క్యాన్సర్ రోగుల మధ్య జరుపుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

యోగా ముఖ్య ఉద్దేశం ఇదే: బాలకృష్ణ

ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యాడ్ లైఫ్ జిమ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాతో మనిషి శక్తిసామర్థ్యాలు ఇనుమడిస్తాయని తెలిపారు. దేహం, మనసు మధ్య సమతుల్యం సాధ్యపడుతుందని అన్నారు. అసలు.... యోగా ముఖ్య ఉద్దేశమే శరీరం, మనసు, బాహ్య పరిస్థితుల నడుమ సామరస్యం పెంపొందించడం అని బాలయ్య భాష్యం చెప్పారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్ ఉదయ్, భరద్వాజ్ అనే యోగా నిపుణులు హాజరై, కార్యక్రమానికి వచ్చిన వారితో యోగాసనాలు వేయించారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యాడ్ లైఫ్ బృందానికి అభినందనలు తెలుపుతున్నట్టు వివరించారు.


More Telugu News