యువ‌తితో గొడ‌వ‌.. నాలుగో అంత‌స్తు నుంచి దూకి యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

  • మృతుడు జ‌గ‌ద్గిరి గుట్ట నెహ్రూ న‌గ‌ర్ వాసిగా గుర్తింపు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌రిచ‌య‌మైన యువ‌తితో స‌న్నిహితంగా ఉంటోన్న శుభ‌మ్‌
  • యువ‌తి ఇంటికి వెళ్లిన శుభ‌మ్
  • ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని యువ‌తిని కోరిన శుభ‌మ్
  • యువ‌తి బ‌య‌ట‌కు రాక‌పోవడంతో హ‌ల్‌చ‌ల్
ఇన్‌స్టాగ్రామ్ లో ఓ యువ‌తిని ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఆమె త‌న‌తో మాట్లాడ‌డం లేద‌ని ఆమె ఇంటికి వెళ్లాడు. చివ‌ర‌కు అక్క‌డే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు ఓ యువ‌కుడు. హైద‌రాబాద్‌లోని బాలా న‌గ‌ర్ శోభ‌న కాల‌నీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  

భ‌వ‌నం నాలుగో అంత‌స్తు నుంచి దూకి శుభ‌మ్ (26) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృతుడు జ‌గ‌ద్గిరి గుట్ట నెహ్రూ న‌గ‌ర్ వాసిగా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌రిచ‌య‌మైన యువ‌తితో శుభ‌మ్‌ స‌న్నిహితంగా ఉంటున్నాడు. గ‌త  రాత్రి బాలాన‌గ‌ర్‌లోని యువ‌తి ఇంటికి వెళ్లాడు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని యువ‌తిని కోరాడు. అయితే, అంత‌కు ముందు వ‌చ్చిన విభేదాల వ‌ల్ల‌ యువ‌తి బ‌య‌ట‌కు రాక‌పోవడంతో హ‌ల్‌చ‌ల్ చేశాడు.

దీంతో ఆ యువ‌తి, ఆమె త‌ల్లిదండ్రులు శుభ‌మ్ తో వాగ్వివాదానికి దిగారు. చివ‌ర‌కు మ‌న‌స్తాపం చెందిన శుభ‌మ్ భ‌వ‌నం పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే, యువ‌తి కుటుంబ స‌భ్యులే శుభ‌మ్‌ను చంపేశార‌ని అత‌డి త‌ల్లిదండ్రులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.




More Telugu News