88 రోజుల క‌నిష్ఠ స్థాయికి క‌రోనా కేసులు

  • కొత్త‌గా 53,256  క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,99,35,221
  • మృతుల సంఖ్య మొత్తం  3,88,135
  • 39,10,19,083 కరోనా పరీక్షలు
భార‌త్‌లో క‌రోనా కేసులు  త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 88 రోజుల క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో నిన్న 53,256  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 78,190 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,99,35,221కు చేరింది. మరో 1,422 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,88,135కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,88,44,199 మంది కోలుకున్నారు. 7,02,887 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 28,00,36,898 డోసులు ఇచ్చారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,24,07,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న  13,88,699 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


More Telugu News