రైలు ప్రమాదంలో కుమారుడు చనిపోయినట్టు నమ్మించి ప్రభుత్వ ఉద్యోగం.. 11 ఏళ్ల తర్వాత బయటపడిన బాగోతం!
- 2010లో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 148 మంది మృతి
- తమ కుమారుడు కూడా చనిపోయినట్టు నమ్మించి పరిహారం, ఉద్యోగం పొందిన కుటుంబం
- విషయం తెలిసి రంగంలోకి దిగిన సీబీఐ
- నిందితుల అరెస్ట్
రైలు ప్రమాదంలో కుమారుడు చనిపోయాడని నమ్మించిన ఓ కుటుంబం ప్రభుత్వం నుంచి పరిహారం అందుకోవడంతోపాటు ఉద్యోగం కూడా పొందింది. ఇది జరిగి 11 సంవత్సరాలు అయిన తర్వాత చనిపోయినట్టు చెప్పిన వ్యక్తి బతికే ఉన్నట్టు రైల్వే అధికారులకు తెలియడంతో వారంతా ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిందీ ఘటన.
2010లో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 148 మంది చనిపోయారు. వీరిలో తమ కుమారుడు అమృతాబ్ చౌధరి (27) కూడా ఉన్నట్టు కుటుంబ సభ్యులు నకిలీ ధ్రువీకరణ పత్రం, డీఎన్ఏ శాంపిళ్లను అధికారులకు అందించారు. దీంతో ఆ కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారం అందించడంతో అమృతాబ్ సోదరికి ఉద్యోగం కూడా ఇచ్చారు.
ఇక్కడి వరకు వరకు బాగానే ఉన్నా రైలు ప్రమాదంలో మరణించినట్టు చెప్పిన అమృతాబ్ బతికే ఉన్నట్టు రైల్వే విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు అమృతాబ్ చౌధరితోపాటు అతడి తండ్రి మిహిర్ చౌధరిని అరెస్ట్ చేశారు.