ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం చేసిన సిద్దిపేట, కామారెడ్డి కలెక్టర్లు.. విమర్శలపై కలెక్టర్ వెంకటరామరెడ్డి వివరణ
- సిద్దిపేట, కామారెడ్డి కలెక్టరేట్లను ప్రారంభించిన కేసీఆర్
- సీఎం కాళ్లు మొక్కడంపై విమర్శలు
- కన్నతండ్రిలా భావించి ఆశీస్సులు తీసుకున్నానన్న సిద్దిపేట కలెక్టర్
సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లకు నమస్కరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం నిన్న ఈ రెండు జిల్లాల కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్లను తీసుకెళ్లి వారి చాంబర్‌లోని సీట్లలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. అలాగే, కామారెడ్డిలోనూ కలెక్టర్ శరత్ ఇలానే కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు.
ముఖ్యమంత్రి కాళ్లకు కలెక్టర్లు పాదాభివందనం చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి స్పందించారు. శుభకార్యం వేళ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమని, దీనికి తోడు నిన్న ఫాదర్స్ డే కూడా కావడంతో కేసీఆర్‌ను తండ్రిలా భావించి ఆశీస్సులు తీసుకున్నట్టు చెప్పారు.