ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల వేళల్లో మార్పు

  • రేపటి నుంచి కొత్త కర్ఫ్యూ నిబంధనలు
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షల సడలింపు
  • ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగుల పనివేళలు
  • ఈ నెల 30 వరకు ఇవే వేళలు అమలు
  • తూర్పు గోదావరి జిల్లాకు మినహాయింపు
ఏపీలో రేపటి నుంచి కొత్త కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలుగా నిర్ణయించారు.

ఈ నెల 30 వరకు ఇవే వేళలు అమల్లో ఉంటాయని సీఎస్ ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాల అధిపతులకు, జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఆంక్షల సడలింపు లేనందున, ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయని వివరించారు.


More Telugu News