ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు: ఈటల రాజేందర్
- హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తల సమావేశం
- హాజరైన ఈటల రాజేందర్
- తనను బర్తరఫ్ చేయడం అరిష్టమని వ్యాఖ్యలు
- కేసీఆర్ పై ప్రతీకారం తప్పదని హెచ్చరిక
ఇవాళ హుజూరాబాద్ లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఈటల నేటి సమావేశంలో టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తనను మంత్రివర్గం నుంచి అన్యాయంగా తొలగించారని, రాష్ట్రానికి అది అరిష్టం అని పేర్కొన్నారు.
కేసీఆర్ ను దెబ్బకుదెబ్బ తీయడం ఖాయమని అన్నారు. తాను దేవుడి కంటే ముందు ప్రజలనే నమ్ముకున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదరించకపోతే ఈటల ఎక్కడ ఉండేవాడని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎవరైనా ఒకసారి హవాతో గెలవొచ్చని, రెండోసారి గెలవాలంటే సొంత సత్తా ఉండాల్సిందేనని ఈటల స్పష్టం చేశారు.
ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం కేసీఆర్ తరం కాదని వ్యాఖ్యానించారు. నాయకులను కొనుగోలు చేయవచ్చేమో కానీ, ప్రజలను కొనుగోలు చేయలేరని పేర్కొన్నారు.