కాన్వాయ్ కు అడ్డొచ్చిన అడవిపంది.. మంత్రి హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం
- సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వెళుతున్న హరీశ్ రావు
- ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చిన అడవిపంది
- సడెన్ బ్రేక్ వేసిన డ్రైవర్
- ఒకదాన్నొకటి ఢీకొన్న వాహనాలు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇవాళ ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అందుకు కారణం... ఓ అడవిపంది అడ్డురావడమే. మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పంది చనిపోయినట్టు తెలుస్తోంది.
ఓ అడవిపంది ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చింది. దాంతో కాన్వాయ్ లోని వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దాంతో కాన్వాయ్ లో వెనుకగా వస్తున్న ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంత్రి హరీశ్ రావు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాన్వాయ్ తిరిగి హైదరాబాద్ బయల్దేరింది. నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటించిన నేపథ్యంలో, ఆర్థికమంత్రి హరీశ్ రావు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.