రేపటి నుంచి తెలంగాణకు బస్సులు తిప్పనున్న ఏపీఎస్ఆర్టీసీ
- తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత
- రేపటి నుంచి ఏపీకి తెలంగాణ ఆర్టీసీ బస్సులు
- తెలంగాణకు బస్సులు తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీ కూడా నిర్ణయం
- అందుబాటులోకి రిజర్వేషన్ సౌకర్యం
ఇన్నాళ్లు లాక్ డౌన్ కారణంగా నిలిచిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రేపటినుంచి రోడ్డెక్కనున్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో, ఇప్పటికే ఏపీకి బస్సులు తిప్పుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించగా, తాజాగా ఏపీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణకు బస్సులు తిప్పుతామని వెల్లడించింది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణకు బస్సులు తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
విజయవాడ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు బస్సులు తిప్పనున్నట్టు పేర్కొంది. కాగా, బస్సులు తిరగనుండడంతో ఏపీఎస్ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. గుంటూరు జిల్లా డిపోల నుంచి హైదరాబాదుకు 12 బస్సులు తిరుగుతాయని తెలిపింది.