డబ్ల్యూటీసీ ఫైనల్: లంచ్ వేళకు టీమిండియా స్కోరు 211/7
- బౌలర్లకు సహకరిస్తున్న సౌతాంప్టన్ పిచ్
- అతికష్టంగా సాగుతున్న భారత బ్యాటింగ్
- జేమీసన్ కు 3 వికెట్లు
- నిరాశపర్చిన పంత్
న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో... నేడు లంచ్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. న్యూజిలాండ్ పేసర్లు విజృంభించడంతో ఇవాళ్టి ఆటలో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.
తొలుత విరాట్ కోహ్లీ (44)ని కైల్ జేమీసన్ వికెట్లు ముందు దొరకబుచ్చుకుని వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (4) కూడా జేమీసన్ బౌలింగ్ లో వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటివరకు ఎంతో ఓపిగ్గా ఆడిన రహానే (49)ను, వాగ్నర్ ఓ షార్ట్ బంతితో బోల్తా కొట్టించాడు.
అయితే, ఈ దశలో అశ్విన్, జడేజా జోడీ కాస్త వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా, అశ్విన్ 27 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు సౌథీ బౌలింగ్ లో ఓ అవుట్ స్వింగ్ ను ఆడే ప్రయత్నంలో అశ్విన్ తన వికెట్ ను సమర్పించుకున్నాడు. దాంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (15 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (2 బ్యాటింగ్) ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 3 వికెట్లు తీయగా, నీల్ వాగ్నర్ కు 2 వికెట్లు లభించాయి. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.