భార‌త్ సాయం కోరిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌

  • టీకాలు పంపండి
  • పేద దేశాల‌కు ఇవ్వాల్సి ఉంది
  • రెండో డోసు కోసం ఎదురుచూపులు
  • ప‌లు దేశాల నుంచి మాకు టీకాలు అంద‌ట్లేదు 
భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ, వ్యాక్సిన్ల కొర‌త వ‌ల్ల విదేశాల‌కు టీకాల ఎగుమ‌తుల‌ను నిలిపివేసిన విష‌యం తెలిసిందే. అయితే, భార‌త్ నుంచి టీకాలు ఎగుమ‌తి చేయాల‌ని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. కొన్ని పేద‌ దేశాలు రెండో డోసు టీకా దొర‌క‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని చెప్పింది.

ఆయా దేశాల‌కు వ్యాక్సిన్లు అందాల్సి ఉంద‌ని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) నుంచి టీకాలు పంపాల‌ని కోరింది. నేపాల్, శ్రీలంకతో పాటు ప‌లు దేశాలు కరోనాతో పోరాడుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ సలహాదారు  బ్రూస్‌ ఐల్వార్డ్ అన్నారు. వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తోన్న దేశాల నుంచి ఆయా దేశాలకు వ్యాక్సిన్‌ డోసులను సమకూర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.  

ఈ నెల‌ ప్రారంభంలో తాము 8 కోట్ల టీకా డోసులను వివిధ దేశాలకు సరఫరా చేశామని గుర్తు చేశారు. అన్ని దేశాలకు సమానంగా పంపిణీని చేపట్టేందుకు మరో 20 కోట్ల డోసులు కావాల్సి ఉందని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ కార‌ణంగా  భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి తమకు టీకాలు అంద‌ట్లేదని తెలిపారు.



More Telugu News