తెలంగాణకు బీజేపీ ఏం చేసింది?: మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం
- ఏడు మండలాలను ఏపీలో కలిపింది
- సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి కేటాయించారు
- ఐటీఐఆర్‌ను సైతం రద్దు చేశారు
- ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు
తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ ఏం చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ఏడు మండలాలను ఏపీలో కలిపిందని ఆయన చెప్పారు. అలాగే, సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి కేటాయించారని ఆయన విమర్శించారు. యూపీఏ మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను సైతం రద్దు చేశారని ఆయన చెప్పారు.
కనీసం విభజన హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఏర్పాటు అంశాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అంతేగాక, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని ఆయన చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమనూ ఏర్పాటు చేయలేదని అన్నారు. తమ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపట్టి ప్రజల బతుకుదెరువును పెంచిందని ఆయన చెప్పారు.