కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేపథ్యంలో ముంద‌స్తు అరెస్టులు

  • కాసేప‌ట్లో జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్
  • మొద‌ట‌ సిద్ధిపేట జిల్లాలో ప‌ర్య‌ట‌న‌
  • కేసీఆర్ ప‌ర్య‌ట‌నకు అడ్డంకులు సృష్టించ‌కుండా చ‌ర్య‌లు
  • కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ విద్యార్థి సంఘాల నేత‌ల అరెస్టు
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాసేప‌ట్లో జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. మొద‌ట‌ సిద్ధిపేట జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో కేసీఆర్ ప‌ర్య‌ట‌నకు అడ్డంకులు సృష్టించ‌కుండా పోలీసులు ముంద‌స్తు అరెస్టులు చేస్తున్నారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని కొంద‌రు నేత‌లు చేసిన హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన విద్యార్థి సంఘాల నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కేసీఆర్ హెలికాప్టర్‌లో సిద్ధిపేటకు చేరుకోనున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యాన్ని ప్రారంభించి, ఆ త‌ర్వాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనాన్ని కూడా ప్రారంభిస్తారు. అక్క‌డి  ప్రజా ప్రతినిథులు, అధికారుల‌తో సమావేశ‌మ‌వుతారు.

అనంత‌రం కామారెడ్డి జిల్లాకు వెళ్లి  సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ప‌లు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. రేపు వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లి కాళోజీ యూనివర్సిటీ, వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్ల భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తారు. సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుప‌త్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.




More Telugu News