జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ!
- నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో లేఖ
- అమరావతి నిర్మాణం అంశం ప్రస్తావన
- ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని వ్యాఖ్య
- మూడు రాజధానులు ఎందుకని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఆయన వరుసగా పది రోజుల నుంచి జగన్‌కు లేఖలు రాస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో అమరావతి నిర్మాణంపై లేఖ రాయడం గమనార్హం. అందులో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టాల్లో ఉన్న సమయంలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకని నిలదీశారు. రాష్ట్రానికి మూడు రాజధానుల వల్ల ఒరిగేదేమీలేదని, అంతేగాక ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఏపీలో అమరావతి రాజధానిగా కొనసాగితే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల వేదనను అర్ధం చేసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.