భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయల్పడిన రాతియుగం నాటి చిప్పలు, సమాధులు!
- జిన్నెలగూడెంలో బయటపడిన నీటి తొట్టెలు, చిప్పలు
- నీటిని నిల్వ చేసుకునేందుకు ఉపయోగించి ఉంటారన్న చరిత్రకారులు
- పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాతియుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లాలోని ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెంలో ఓ రైతు పొలం దున్నతున్న సమయంలో ఇవి వెలుగుచూశాయి. రాతి యుగంనాటి సమాధుల ఆనవాళ్లతోపాటు రాతి చిప్పలు ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు గొగ్గల శంకర్ పరిశీలించారు.
రాతి చిప్పలతోపాటు పొలాల పక్కన పరుపురాతి బండలపై తొలిచిన నీటి తొట్టెలు కూడా ఉన్నట్టు చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. నీటిని నిల్వ చేసుకునేందుకు ఆదిమానవులు ఈ తొట్టెలను ఉపయోగించి ఉంటారని, నీటిని తాగేందుకు రాతి చిప్పల్ని ఉపయోగించి ఉంటారని తెలంగాణ వారసత్వ శాఖ అధికారిగా గతంలో పనిచేసిన భానుమూర్తి పేర్కొన్నారు.