నారా లోకేశ్, కొల్లు రవీంద్రపై పాత కేసును సమీక్షిస్తున్న సూర్యాపేట పోలీసులు

  • గతేడాది జూన్ 12న కేసు నమోదు
  • కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించారని అభియోాగాలు
  • పెండింగ్ కేసుల సమీక్షలో భాగమన్న పోలీసులు
ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన కింజరాపు అచ్చెన్నాయుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో గతేడాది జూన్ 12న రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ నేతలు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, పట్టాభి, దేవినేని చందు, జాస్తి సాంబశివరావు తదితరులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా గుంపుగా ఉండొద్దని పోలీసులు వారికి సూచించారు.

అయినప్పటికీ వారు పెడచెవిన పెట్టారన్న ఆరోపణలపై అదే రోజు రాత్రి సూర్యాపేట ఎస్సై ప్రశాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును పోలీసులు సమీక్షిస్తున్నారు. విచారణలో భాగంగా లోకేశ్‌తోపాటు ఈ కేసులో ఉన్న ఇతర నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెండింగ్ కేసుల సమీక్షలో భాగంగానే ఈ కేసును పరిశీలించినట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News