జాగ్రత్త.. మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వస్తుంది: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వార్నింగ్

  • థర్డ్ వేవ్ హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవాలి
  • లాక్ డౌన్ సడలించామని విచ్చలవిడిగా ప్రయాణాలు పెట్టుకోవద్దు
  • కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించండి
కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెచ్చరించారు. కరోనా నిబంధనలను పాటించడంలో అలసత్వం వద్దని అన్నారు. లాక్ డౌన్ నిబంధనలను సడలించడాన్ని అలుసుగా తీసుకోవద్దని... విహారయాత్రలు చేయవద్దని చెప్పారు.

నిబంధనలను సడలించారని విచ్చలవిడిగా ప్రయాణాలను ప్రారంభిస్తే... మళ్లీ 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. మహారాష్ట్రలో విడతల వారీగా లాక్ డౌన్ ను సడలిస్తున్న సంగతి తెలిసిందే. రెండో విడతలో భాగంగా పూణెలో లాక్ డౌన్ ను సడలించారు. ఈ సందర్భంగా పూణెలో పరిస్థితిని అజిత్ పవార్ సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News