తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత.. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
- కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం
- వైద్య శాఖ నివేదిక ఆధారంగా నిర్ణయం
- ఈ రోజు నుంచే అన్ లాక్ అమలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గిందంటూ వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ రోజు నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. దీంతో, అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. అయితే అంతరాష్ట్ర బస్ సర్వీసులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మే 12న తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.