వరంగల్ రూరల్ జిల్లా పేరు మార్పు: మంత్రి ఎర్రబెల్లి
- ఉమ్మడి వరంగల్ ఇప్పటికే ఆరు జిల్లాలుగా విభజన
- గతంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్ల విషయంలో భిన్నాభిప్రాయాలు
- చాలా రోజులుగా ప్రతిపాదనలు
- ఎల్లుండి వరంగల్ నగరానికి కేసీఆర్
- వరంగల్ రూరల్ జిల్లా పేరును హన్మకొండగా మార్చే అవకాశం
వరంగల్ రూరల్ జిల్లా పేరుపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జిల్లాల విభజన సమయంలో ఉమ్మడి వరంగల్‌ను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలుగా ఏర్పాటు చేసిన విషయం విదితమే.
అయితే, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ పేర్లను మార్చాలని సూచనలు వచ్చాయి. అయితే, ఇప్పటికీ మార్పులు జరగలేదు. వరంగల్‌లో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ చేయడానికి సీఎం కేసీఆర్ ఎల్లుండి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా పేరును హన్మకొండగా మార్చే అవకాశం ఉందని ఎర్రబెల్లి ఈ రోజు మీడియాకు చెప్పారు. కొన్ని రోజుల క్రితం కూడా ఈ విషయాన్నే మీడియాకు తెలిపారు. కాగా, సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భూమిపూజ అనంతరం కేసీఆర్ కాళోజీ హెల్త్ వర్సిటీ, కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారని ఆయన తెలియజేశారు. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని చెప్పిన ఎర్రబెల్లి.. కరోనా వేళ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.