వైసీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలి: యనమల డిమాండ్
- ప్రతిపక్ష నేతగా జగన్ అప్పట్లో యువతకు హామీ
- ఉద్యోగాలపై ఆయన ఇచ్చిన హామీ అతి పెద్ద మోసం
- నిరుద్యోగ రేటు ఇప్పటికే 13.5 శాతానికి పెరిగిపోయింది
- అంతమంది వైసీపీ ఎంపీలు ఉండి 'హోదా'ను సాధించడంలో విఫలం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం జగన్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా జగన్ అప్పట్లో యువతకు ఇచ్చిన హామీ అతి పెద్ద మోసమని అన్నారు.
నిరుద్యోగిత రేటు ఇప్పటికే 13.5 శాతానికి పెరిగిపోయిందని యనమల చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేక ఏ పరిశ్రమా రాష్ట్రానికి రావట్లేదని, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపట్లేరని అన్నారు.
కేంద్రంతో జగన్ ములాఖత్ అవడం వల్ల యువతకు నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతమంది వైసీపీ ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారని యనమల విమర్శించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిన్న 2021-22 జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండేళ్లలో తాము లక్షలాది ఉద్యోగాలు కల్పించామని జగన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఆయనపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.