సికింద్రాబాద్ నుంచి త్రిపుర రాజధాని అగర్తలాకు ప్రత్యేక రైలు

  • ప్రతి సోమవారం సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు
  • తిరుగు ప్రయాణంలో శుక్రవారం అగర్తలా నుంచి బయలుదేరనున్న రైలు
  • తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్ల రద్దు
  • విశాఖ-కాచిగూడ, విశాఖ-కడప, లింగంపల్లి-విశాఖ మధ్య రైళ్లు రద్దు
ఈ నెల 21, 28వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి త్రిపుర రాజధాని అగర్తాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రతి సోమవారం సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుందని, తిరుగు ప్రయాణంలో శుక్రవారం అగర్తలా నుంచి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. అలాగే, రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో ఈ నెల 21-22 నుంచి ఈ నెల 30, జులై 1 వరకు ఆరు రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో విశాఖపట్టణం-కాచిగూడ (08561), కాచిగూడ-విశాఖపట్టణం (08562), విశాఖపట్టణం-కడప (07488), కడప-విశాఖపట్టణం (074887), విశాఖపట్టణం-లింగంపల్లి (02831), లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైళ్లు ఉన్నాయి.


More Telugu News