థర్డ్ వేవ్ పై ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది: ఏకే సింఘాల్

  • కరోనా థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు
  • అప్రమత్తమైన ఏపీ సర్కారు
  • ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, బెడ్ల ఏర్పాటు
  • ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం
కరోనా థర్డ్ వేవ్ తప్పదని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ పై ఏపీ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. జూన్ నెలాఖరుకు  12 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అంతేకాకుండా, అదే సమయానికి 10 వేల డి టైప్ సిలిండర్లు కూడా అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

ఏపీలో 113 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామని చెప్పారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో 6,151 ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారని సింఘాల్ వెల్లడించారు.


More Telugu News