ఏపీ శాసనమండలి ప్రొటెం స్పీకర్ గా విఠపు బాలసుబ్రహ్మణ్యం... గవర్నర్ ఆమోదం

  • శాసనమండలిలో నలుగురు కొత్త సభ్యులు
  • ఇటీవల ముగిసిన చైర్మన్ మహ్మద్ షరీఫ్ పదవీకాలం
  • కొత్త సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ప్రొటెం స్పీకర్
  • విఠపు పేరును సిఫారసు చేసిన సీఎం జగన్
ఏపీ శాసనమండలిలో నలుగురు కొత్త సభ్యులు వస్తున్నారు. గవర్నర్ నామినేట్ చేసిన వైసీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్ కొత్త ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఇప్పటివరకు మండలి చైర్మన్ గా వ్యవహరించిన మహ్మద్ షరీఫ్ ఇటీవల రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆ నలుగురు కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రొటెం స్పీకర్ అవసరం కాగా, విఠపు బాలసుబ్రహ్మణ్యం పేరును సీఎం జగన్ ప్రతిపాదించారు. సీఎం సిఫారసు మేరకు ఏపీ శాసనమండలి ప్రొటెం స్పీకర్ గా విఠపు బాలసుబ్రహ్మణ్యం ఎంపికను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. త్వరలోనే కొత్త సభ్యులతో విఠపు మండలిలో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.


More Telugu News