క్రికెట్ అభిమానులకు నిరాశ... డబ్ల్యూటీసీ ఫైనల్ తొలిరోజు ఆట వర్షార్పణం

  • సౌతాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ పోరు
  • డబ్ల్యూటీసీ ఫైనల్ 
  • వర్షంతో చిత్తడిగా మారిన మైదానం
  • ఒక్క బంతి పడకుండానే తొలిరోజు రద్దు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు వరుణుడి పోటు తప్పలేదు. తొలి రోజు ఆట వర్షార్పణం అయింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న సౌతాంప్టన్ లో వర్షం కురుస్తుండడంతో నేడు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు.

సౌతాంప్టన్ లో ఈ ఉదయం నుంచి వర్షం ఆగిపోతూ, పడుతూ పలుమార్లు దోబూచులాడింది. ఓ దశలో లంచ్ తర్వాత మ్యాచ్ ప్రారంభం అవుతుందని అంచనా వేసినా, వరుణుడు మళ్లీ ప్రత్యక్షం కావడంతో నిరాశ తప్పలేదు. తొలి రోజు ఆట రద్దయినప్పటికీ ఈ టెస్టు మ్యాచ్ 5 రోజుల పాటు సాగనుంది. ఎందుకంటే, ఇది కీలక సమరం కావడంతో ఈ మ్యాచ్ కు రిజర్వ్ డేను కేటాయించారు.


More Telugu News