ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాను: 'ప్రత్యేక హోదా'పై సీఎం జగన్
- ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
- ప్రత్యేక హోదా అంశం ప్రస్తావన
- అంతకుమించి ఏంచేయగలమని వ్యాఖ్యలు
- గత పాలకులు హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపణ
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై సీఎం జగన్ స్పందించారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఆశతో ఉన్నామని పేర్కొన్నారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి స్పెషల్ స్టేటస్ అంశంపై కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నానని, అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అయితే వెనుకంజ వేయొచ్చేమో కానీ, పూర్తి మెజారిటీతో ఉన్న కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గత పాలకులు ప్యాకేజీ కోసం, ఓటుకు కోట్లు కేసు కోసం ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వానికి చెందిన ఇద్దరు పెద్దలు కేంద్రమంత్రులుగా పదవులు దక్కించుకున్నారని విమర్శించారు. ప్రజలను హోదాపై మాటలతోనే మభ్యపెట్టారని ఆరోపించారు.