కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని అభినందించిన టీడీపీ అధినేత చంద్రబాబు
- నీలకంఠాపురంలో పురాతన ఆలయం
- 1,200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం
- రఘువీరా, గ్రామస్థుల కృషితో పునర్ నిర్మాణం
- ఈ నెల 19 నుంచి నాలుగు రోజులు పవిత్ర కార్యక్రమాలు
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ప్రాచీన ఆలయాన్ని పునర్ నిర్మించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. నీలకంఠాపురంలో ఈ ఆలయాన్ని రేపు శాస్త్రోక్తంగా పునః ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఓ వీడియో సందేశం అందించారు.
మహోన్నతమైన ఆలోచనలతో ఆలయాల పునర్ నిర్మాణం బాధ్యతలు స్వీకరించిన రఘువీరాకు, నీలకంఠాపురం గ్రామస్థులకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 1,200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పురాతన పుణ్యక్షేత్రం ఏపీ, కర్ణాటక ప్రజలకు నెలవుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు నీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద పవిత్రమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ఇది ఎంతో మంచి సంకల్పం అని చంద్రబాబు అభివర్ణించారు.