టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్.. టీమిండియా తుది జట్టు ఇదే!
- కాసేపట్లో ప్రారంభం కానున్న టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్
- సౌతాంప్టన్ లో న్యూజిలాండ్ తో తలపడనున్న టీమిండియా
- రోహిత్ కు జోడీగా ఓపెనింగ్ కు రానున్న శుభ్ మన్ గిల్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ మ్యాచ్ ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య కాసేపట్లో ఇంగ్లండ్ లోని సౌంథాంప్టన్ లో ప్రారంభం కానుంది. సౌతాంప్టన్ మైదానం మొత్తం పచ్చటి గడ్డితో అత్యంత సుందరంగా ఉంది. అయితే, వర్షాకాలం కావడంతో పిచ్ ను కవర్లతో కప్పేశారు.
మరోవైపు ఫైనల్స్ మ్యాచ్ లో ఆడనున్న తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్ ఆడబోతున్న ఆటగాళ్లు వీరే. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, మొహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా.
టీమిండియా జట్టుకు అజింక్య రహానే వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ రానున్నట్టు తెలుస్తోంది. వీరి తర్వాత వరుసగా పుజారా, కోహ్లీ బ్యాటింగ్ చేయనున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే... పేసర్లుగా బుమ్రా, షమీ, ఇశాంత్ ఉన్నారు. స్పిన్నర్లుగా అశ్విన్, జడేగా తమ వంతు పాత్రను పోషించబోతున్నారు. తుది జట్టులో హనుమ విహారి, సిరాజ్, ఉమేశ్ యాదవ్ లు తమ స్థానాలను కోల్పోయారు.