కరోనా మూడో దశపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- అనవసరంగా ప్రజలను భయపెడుతున్నారు
- అటువంటి ప్రచారాలు సరికాదు
- కొవిడ్ కట్టడికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలి
- రాష్ట్రంలో 46 ఆసుపత్రులకు 1400 వెంటిలేటర్లు అందించాం
కరోనా మూడో దశపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనవసరంగా ప్రజలను భయపెడుతున్నారని, అటువంటి ప్రచారాలు సరికాదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
కొవిడ్ కట్టడికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలని చెప్పారు. యూరప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి పెద్ద దేశాలలో కరోనా అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్‌లను తయారు చేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. దేశంలో రెండో దశ కరోనా విజృంభణ మొదలవగానే 15 రోజుల్లో ఆక్సిజన్ కొరతను పరిష్కరించామన్నారు.
తెలంగాణలో 46 ఆసుపత్రులకు 1400 వెంటిలేటర్లు అందించామని ఆయన వివరించారు. 200 కోట్ల టీకాలను భారత్‌లో తయారు చేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు చెప్పారు. తెలంగాణకు ఇప్పటివరకు 80 లక్షల డోసులు ఇచ్చామని వివరించారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులకు 15 లక్షల డోసులు ఇచ్చామని తెలిపారు.