ఆకట్టుకుంటోన్న 'పుష్పక విమానం' లిరికల్ వీడియో
- విభిన్న కథా చిత్రంగా 'పుష్పక విమానం'
- కథానాయికగా గీత్ శైనీ పరిచయం
- దామోదరకి ఇది ఫస్టు మూవీ
- సిద్ శ్రీరామ్ నుంచి మరో పాట
ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర ఒక విభిన్నమైన కథా చిత్రాన్ని రూపొందించాడు. 'పుష్పక విమానం' అనే టైటిల్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయవుతున్నాడు. ఇక కథానాయిక గీత్ శైనీకి కూడా ఇదే ఫస్టు సినిమా. ఈ సినిమా నుంచి 'కల్యాణం ..' అనే లిరికల్ వీడియో సాంగ్ ను సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నట్టుగా నిన్ననే తెలియజేశారు. అనుకున్న సమయానికి ఆ లిరికల్ వీడియోను వదిలారు.
"అమ్మలాల పైడి కొమ్మలాలో .. ముద్దుల గుమ్మలాలో" అంటూ ఈ పాట సాగుతోంది. 'ఇంటిపేరు మారే ఈ తంతులో చుక్కలే అక్షింతలో' అనే ప్రయోగం బాగుంది. నాయకా నాయికలను పెళ్లికూతురు .. పెళ్లికొడుకుగా ముస్తాబుజేయడం .. పెళ్లి పీటలపైకి తీసుకురావడం .. ఒకరిని ఒకరు ముచ్చటగా చూసుకుని మురిసిపోవడం .. ఈ పాటలో కనిపిస్తోంది. మధ్యలో సాంగ్ మేకింగ్ విజువల్స్ ను కూడా జోడించారు. ఈ పెళ్లి సీన్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ తో కలిసి మంగ్లీ బృందం పాడింది.