జస్టిస్ లోథా సిఫారసుల మేరకే అజారుద్దీన్ కు నోటీసులు: అపెక్స్ కౌన్సిల్

  • హెచ్ సీఏ అధ్యక్షుడు అజర్ పై వేటు
  • అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం
  • కౌన్సిల్ నిర్ణయాన్ని అంగీకరించని అజర్
  • చట్టవిరుద్ధమని వ్యాఖ్యలు
  • అజర్ ఇప్పుడు మాజీ అధ్యక్షుడన్న కౌన్సిల్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. హెచ్ సీఏ అధ్యక్ష పదవి నుంచి మహ్మద్ అజారుద్దీన్ పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేస్తూ, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులు చట్ట విరుద్ధమని, తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్ కు లేదు అని అజర్ అంటున్నాడు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ స్పందించింది.

జస్టిస్ లోథా సిఫారసుల మేరకే అజారుద్దీన్ కు నోటీసులు ఇచ్చామని స్పష్టం చేసింది. కౌన్సిల్ లోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ వ్యవహారంలో బీసీసీఐ జోక్యం ఉండదని తెలిపింది. నేటి నుంచి అజారుద్దీన్ హెచ్ సీఏ అధ్యక్షుడు కాదని అపెక్స్ కౌన్సిల్ స్పష్టత నిచ్చింది. అయితే, హెచ్ సీఏ సమావేశాలకు అజారుద్దీన్ అధ్యక్షుడిగా కాకుండా వ్యక్తిగత హోదాలో హాజరుకావొచ్చని సూచించింది.


More Telugu News