అధ్యక్షుడిని నేనే.. అన్ని అధికారాలు నావే: అజారుద్దీన్
- 25 ఏళ్లుగా కొందరు హెచ్సీఏలో కొనసాగుతున్నారు
- అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి
- హెచ్సీఏలో జరుగుతున్నది బీసీసీఐకి కూడా తెలుసు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. దీనిపై అజారుద్దీన్ స్పందిస్తూ... తనకు అపెక్స్ కౌన్సిల్ ఇచ్చిన నోటీసులు చట్ట విరుద్ధమని అన్నారు. గత 25 ఏళ్లుగా కొందరు హెచ్సీఏలో ఉంటున్నారని... ఇన్నేళ్లుగా వారు ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఎవ్వరినీ వీరు హెచ్సీఏలోకి రానివ్వరని... వచ్చిన వారిని ఉండనివ్వరని దుయ్యబట్టారు. బ్లాక్ మెయిల్ చేసి పంపించేస్తారని మండిపడ్డారు. వారి అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు.
అపెక్స్ కౌన్సిల్ లో తొమ్మిది మంది ఉన్నారని... వీరిలో ఐదుగురు ఒ వర్గంగా ఏర్పడి, వారు చెప్పిందే జరగాలని భావిస్తున్నారని అజార్ చెప్పారు. హెచ్సీఏలో జరిగిన అవినీతిని అరికట్టడానికి సమర్థుడైన అంబుడ్స్ మెన్ ను నియమిస్తే... ఆ ఐదుగురే తప్పు పట్టారని అన్నారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే ఇలా చేస్తున్నారని విమర్శించారు. కౌన్సిల్ లోని విజయానంద్, జాన్ మనోజ్, నరేశ్ శర్మ, అనురాధ, సురేందర్ అగర్వాల్ లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.
క్రికెట్ తెలిసిన వారు కమిటీలో లేరని అజార్ అన్నారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ప్రేమ అని... క్రికెట్ ను అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. బ్లాక్ మెయిళ్లకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. హెచ్సీఏలో ఏం జరుగుతోందో బీసీసీఐకి తెలుసని... తాను కూడా ఈ వివరాలను బీసీసీఐకి అందిస్తానని చెప్పారు. బీసీసీఐతో మాట్లాడి హెచ్సీఏ బాడీని డిజాల్వ్ చేస్తానని అన్నారు. హెచ్సీఏ అధ్యక్షుడిని తానేనని, తనకు అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పారు.