ఏపీలో జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు పదో తరగతి పరీక్షలు?

  • ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన 
  • ఈసారి 11కు బదులుగా ఏడు పేపర్లు
  • సామాన్య శాస్త్రం మినహా మిగతా పేపర్లకు వందశాతం మార్కులు
కరోనా వేళ పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సబబు కాదని ప్రతిపక్షాలు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జులై 26వ తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది.

రాష్ట్రంలోని 6.28 లక్షల మంది విద్యార్థులు నాలుగువేలకుపైగా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. అయితే, ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా ఏడు పేపర్లు మాత్రమే నిర్వహించనున్నారు. అలాగే, సామాన్య శాస్త్రం మినహా మిగతా సబ్జెక్టులకు వంద మార్కులు ఉంటాయి. భౌతిక, రసాయన శాస్త్రం పేపర్-1గా, జీవశాస్త్రం పేపర్-2గా 50 మార్కుల చొప్పున నిర్వహిస్తారు.


More Telugu News