త్వరలో మార్కెట్లోకి స్పుత్నిక్‌-వి టీకా

  • ప్రస్తుతం హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉన్న టీకా
  • త్వరలో మరిన్ని నగరాలకు విస్తరణ
  • నిల్వ, పంపిణీ వసతులపై అవగాహన
  • డాక్టర్ రెడ్డీస్‌ వెల్లడి
భారత్‌లో అందుబాటులోకి వచ్చిన మూడో కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రకటించింది. భారత్‌లో ఈ టీకా ఉత్పత్తి, పంపిణీకి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకొన్న విషయం తెలిసిందే.

అందులో భాగంగా ముందుగానే వ్యాక్సిన్‌ నిల్వ వసతులను పరీక్షించడంలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న హైదరాబాద్‌ సహా మరో తొమ్మిది నగరాల్లోనూ ఈ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ నగరాల జాబితాలో విశాఖపట్నం, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, బద్ది, చెన్నై, మిర్యాలగూడ, కొల్హాపూర్‌ ఉన్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీంతో ఆయా నగరాల్లో టీకా నిల్వ, పంపిణీ వసతులు, కొవిన్‌తో అనుసంధానం సహా ఇతరత్రా అంశాలపై అవగాహన వస్తుందన్నారు.


More Telugu News