తెలంగాణలో గత 24 గంటల్లో 1,489 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు

  • తాజాగా 1,16,252 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 175 కొత్త కేసులు
  • నిర్మల్ జిల్లాలో 2 కేసుల నమోదు
  • ఇంకా 19,975 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఏమంత తీవ్రస్థాయిలో లేదనే చెప్పాలి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,16,252 కొవిడ్ టెస్టులు నిర్వహించగా 1,489 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 175, నల్గొండ జిల్లాలో 131, ఖమ్మం జిల్లాలో 118 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 2 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,436 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,07,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,84,429 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,975 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,521కి పెరిగింది. కరోనా మరణాల శాతం జాతీయస్థాయిలో 1.3 కాగా, తెలంగాణలో అది 0.57 శాతానికి తగ్గింది.


More Telugu News