రెండో దశ కరోనా ఉద్ధృతిలో 730 మంది వైద్యుల మృత్యువాత
- వెల్లడించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
- అత్యధికంగా బీహార్‌లో 115 మంది మరణం
- ఢిల్లీలో 109 మంది మృత్యువాత
- ఏపీలో 70, తెలంగాణలో 12 మంది మరణం
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. బాధితుల్ని కాపాడే క్రమంలో అనేక మంది వైద్యులు సైతం తమ ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. రెండో దశ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 730 మంది వైద్యులు మరణించినట్లు ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)’ ప్రకటించింది.
అత్యధికంగా బీహార్‌లో 115 మంది వైద్యులు మరణించారు. ఢిల్లీలో 109 మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో 91 మంది, మహారాష్ట్రలో 81 మంది, పశ్చిమ బెంగాల్లో 71, ఆంధ్రప్రదేశ్‌లో 70, తెలంగాణలో 12 మంది మరణించారు. ఐఎంఏ కొవిడ్ రిజిస్ట్రీ వివరాల ప్రకారం.. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలో 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.