అంతటి గొప్ప సంస్థ కూడా జే ట్యాక్స్ లు చెల్లించలేక ఏపీకి బైబై చెప్పేసింది: లోకేశ్

  • ఏపీ నుంచి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిష్క్రమణ
  • మీడియాలో కథనం
  • వ్యంగ్యంగా స్పందించిన లోకేశ్
  • ఏ1, ఏ2 ఫ్రాడ్ రెడ్లు అంటూ వ్యాఖ్యలు
ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గొప్పదనం ఏ1 ఫ్రాడ్ రెడ్డికి ఏంతెలుసని తాను అనుకోవడంలేదని, ఎందుకంటే ఇందులో ఫ్రాడ్ స్టార్ ఏ1 రెడ్డి అక్షరాలా 9 కోట్ల షేర్లు కొని పెట్టుబడిగా ఉంచారని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ వెల్లడించారు. ఇది ఎంత పెద్ద సంస్థో, ఏ స్థాయిలో లాభాలు తెచ్చిపెడుతుందో ఫ్రాడ్ రెడ్డికి బాగా తెలుసని వివరించారు.

అంతటి కంపెనీని ఎన్నో కష్టనష్టాలకోర్చి, కంపెనీ సీఈవోలను బతిమాలి ఏపీకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని లోకేశ్ ఉద్ఘాటించారు. తీరాచూస్తే ఏ1, ఏ2 ఫ్రాడ్ రెడ్ల జే ట్యాక్స్ లు చెల్లించలేక ఫ్రాంక్లిన్ ఏపీకి బైబై చెప్పేసిందని ఆరోపించారు.

"కేవలం ఐదు రూపాయల కోసం టిక్ టాక్ లో బైబై బాబూ అని పెయిడ్ వీడియోలు పెట్టిన పేటీఎం కూలీలు.... ఇప్పుడు బైబై డెవలప్ మెంట్, బైబై ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటూ వీడియోలు పెట్టాలి" అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోయిన అంశంపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని కూడా లోకేశ్ పంచుకున్నారు.


More Telugu News