గ్రూప్-1 ఇంటర్వ్యూలను 4 వారాల పాటు నిలిపివేయండి: ఏపీ హైకోర్టు ఆదేశాలు
- హైకోర్టుకు చేరిన గ్రూప్-1 వ్యవహారం
- డిజిటల్ మూల్యాంకనంపై విమర్శలు
- కోర్టులో 8 పిటిషన్లు దాఖలు
- విచారణ చేపట్టిన న్యాయస్థానం
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, డిజిటల్ మూల్యాంకనంపై దాఖలైన 8 పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం గ్రూప్-1 మెయిన్స్ ఇంటర్వ్యూలను 4 వారాల పాటు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశిస్తూ స్టే ఇచ్చింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు...
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు...
- గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించలేదు.
- డిజిటల్ మూల్యాంకనం గురించి చివరి దశలో తెలిపారు.
- తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్లను రాష్ట్రంలో మూల్యాంకనం చేశారు.
- ఇంగ్లీషు మీడియం అభ్యర్థుల జవాబు పత్రాలను ఇతర రాష్ట్రాల్లో మూల్యాంకనం చేశారు.
- ఇంగ్లీషు మీడియంలో రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగింది.
- ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం ఎలా చేయిస్తారు?
- ఏపీపీఎస్సీ చైర్మన్ ను పక్కనబెట్టి కార్యదర్శి ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు తీసుకున్నారు.
- గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అన్ని నిబంధనలు పాటించాం.
- మూల్యాంకనం గురించి ముందుగా చెప్పాల్సిన పనిలేదు.