ఏపీలో ఆ నలుగురు ఇక ఎమ్మెల్సీలు... ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం

  • మండలిలో కొత్త ఎమ్మెల్సీలు
  • నలుగురి పేర్లను సిఫారసు చేసిన సర్కారు
  • ఆమోదం తెలిపిన గవర్నర్
  • అధికారికంగా గుర్తించిన ఎన్నికల సంఘం
ఏపీ ప్రభుత్వం ఇటీవల తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్ లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, గవర్నర్ ఆమోదంతో ఎన్నికల సంఘం నామినేటెడ్ ఎమ్మెల్సీల ఉత్తర్వులు జారీ చేసింది. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డిలను ఎమ్మెల్సీలుగా ఈసీ ప్రకటించింది.

ఇటీవల శాసనమండలిలో టీడీపీ సభ్యుల పదవీకాలం ముగియడంతో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇది గవర్నర్ కోటాకు సంబంధించిన అంశం కావడంతో వైసీపీ సర్కారు తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి), రమేశ్ యాదవ్ (కడప), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), మోషేన్ రాజు (పశ్చిమ గోదావరి)ల పేర్లను గవర్నర్ కు సిఫారసు చేసింది. ఇటీవలే ఆ పేర్లను గవర్నర్ ఆమోదించారు.

 


More Telugu News