అమరావతి రైతులకు రూ.195 కోట్ల కౌలు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- ల్యాండ్ పూలింగ్ లో భూములు అప్పగించిన రైతులు
- నాటి ప్రభుత్వంతో ఒప్పందం
- ఏటా కౌలు చెల్లించేందుకు అంగీకారం
- తాజాగా కౌలు విడుదల చేస్తూ ఉత్తర్వులు
అమరావతి రైతులకు 2021-22 ఏడాదికి గాను రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ఏపీ ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ పథకం కింద గతంలో ప్రభుత్వానికి భూములు అప్పగించిన వారికి ఈ వార్షిక కౌలు వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
కాగా, ఈ ఏడాది కౌలు కోసం మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేసింది. గతంలో రైతులు కోర్టును ఆశ్రయించగా, విచారణ తర్వాతే సర్కారు నిధులు విడుదల చేసింది. ఈసారి విచారణకు ముందుగానే కౌలు ఇచ్చినట్టయింది.