వైఎస్ వివేక హత్య కేసు.. ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తోన్న సీబీఐ
- పదో రోజు కొనసాగుతోన్న విచారణ
- చిట్వేలి మండలానికి చెందిన వైసీపీ నేతలు లక్ష్మీకర్, రమణ
- సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డి
- వారిని విచారిస్తోన్న సీబీఐ అధికారులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) పదో రోజు విచారణ కొనసాగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి సీబీఐ అధికారులు ఈ రోజు ముగ్గురు అనుమానితులను పిలిపించి విచారిస్తున్నారు. చిట్వేలి మండలానికి చెందిన వైసీపీ నేతలు లక్ష్మీకర్, రమణను, సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. గతంలో వివేకాకు జగదీశ్వర్ రెడ్డి పీఏగా పనిచేశారు.
కాగా, ఇప్పటికే వివేక హత్య కేసులో అనుమానితుడిగా వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అలాగే, వివేక ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇదయతుల్లా నుంచి కూడా పలు వివరాలు తీసుకున్నారు.